భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో  మార్చి 14  న  పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం మేత్రాణులు మహా పూజ్య రాయరాలా విజయ్ కుమార్  గారు తైలాల ప్రతిష్ట దివ్యపూజాబలి సమర్పించారు.  మోన్సిగ్నోర్  దూసి దేవా రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ దైవకార్యం కథోలిక సంప్రదాయాలను, విశ్వాసాన్ని బలపరిచింది.

ఈ సందర్భంగా పీఠాధిపతులవారు దైవ సందేశమందిస్తూ పవిత్ర తైలాలు, వాటి ఉద్ధేశాల గురించి వివరించారు. గురువుల కోసం ప్రార్థించాలని కోరారు. అనంతరం నూతన తైలాలను అభిషేకించారు.

దివ్యపూజాబలి ఏర్పాట్లను విచారణ గురువు గురుశ్రీ పాల్ భూషణ్  గారు పర్యవేక్షించారు. ఉపదేశులు , విచారణ యువత, మరియదళ సభ్యులు ఏలోటూ రాకుండా పండుగ ఏర్పాట్లు చేశారు. విచారణ గాయక  బృందం పాడిన పండుగ పూజ పాటలు అందరినీ అలరించాయి. దివ్యపూజాబలి అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేత్రాసనం లోని గురువులు, కన్యాస్త్రీలు, కథిడ్రల్, కో కథిడ్రల్ విశ్వాసులు పాల్గొన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer