చిట్టిబాబుగారికి జాతీయ అవార్డు

చిట్టిబాబుగారికి జాతీయ అవార్డు
నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారు భారతరత్న సుబ్రహ్మణ్యం పేరు మీదగా జాతీయస్థాయిలో పేదల అభ్యున్నతికి కృషి చేసేవారికి అవార్డులు ప్రదానం చేస్తున్నారు.
భారతదేశంలో 2024-25 వ సంవత్సరానికి గాను 14 మందిని ఎంపిక చేయగా అందులో శ్రీ పెంకి చిట్టిబాబు గారిని దళిత ఆదివాసీల బహుజనుల జీవితాలను మార్చేందుకు అయన చేస్తున్న నిస్వార్థమైన సేవలకు గాను అందులో చోటు దక్కింది.
ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును మే 22 వ తేదీన ఇండియన్ హాబిటేట్ సెంటర్, న్యూ ఢిల్లీ లో శ్రీ పెంకి చిట్టిబాబు గారు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల శ్రీ పెంకి చిట్టి బాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు దళిత ఆదివాసీల బ్రతుకుల్లో మార్పు చేసేందుకు మరింత బాధ్యత పెరిగిందని తెలియజేశారు.
విశాఖ అతిమేత్రాసనానికి చెందిన శ్రీ పెంకి చిట్టిబాబు గారు బాలల, దళిత, ఆదివాసీ హక్కుల ఉద్యమ సారధి మరియు స్పిరిట్చ్యువల్ ప్రేయర్ టవర్ బృంద నిర్వాహకులగా , పవిత్రాత్మ నూత్నీకరణ ఉద్యమ సారధిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.
శ్రీ పి చిట్టిబాబు గారికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు తరుపున అభినందనలు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer