భక్తియుతంగా దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు
భక్తియుతంగా దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు
విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, పునీత పేతురు ప్రధాన దేవాలయ హాలులో దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు భక్తియుతంగా జరిగాయి. డిసెంబర్ 15న, శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు గారి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.
జ్ఞానాపురం దేవమాత సొడాలిటి సభ వారు నిర్వహించిన ఈ క్రిస్మస్ వేడుకలకు విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ మరియు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
బాలల సొడాలిటి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గురుశ్రీ వినయ్ బైబిల్ క్విజ్ నిర్వహించగ, విజేతలకు గురుశ్రీ జాన్ ప్రకాష్ గారు బహుమతులు ప్రధానం చేశారు.
తదనంతరం సొడాలిటి సభ్యులు ఇంటికే పరిమితమైన వృద్ధులను, రోగులను సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, వారికీ కానుకలను అందించారు.
ఈ సందర్భంగ గురుశ్రీ జాన్ ప్రకాష్ గారు మాట్లాడుతూ 120సం.లుగ దేవమాత సొడాలిటి విశాఖ అతిమేత్రాసనంలో అందిస్తున్న సేవలను కొనియాడారు.
శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు గారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer