పోప్ ఫ్రాన్సిస్ ఇటాలియన్ సహకారాన్ని చురుకైన దాతృత్వాన్ని ప్రోత్సహించారు

పోప్ ఫ్రాన్సిస్ ఇటాలియన్ సహకారాన్ని చురుకైన దాతృత్వాన్ని ప్రోత్సహించారు

మహా పూజ్య పొప్ ఫ్రాన్సిస్ గారు యునికూప్ ఫ్లోరెన్స్ మరియు ది హార్ట్ మెల్ట్స్ ఫౌండేషన్ సభ్యులతో  సమావేశమయ్యారు.  పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ భగవంతుని అవతారం యొక్క రహస్యం, అవసరమైన వారికి దగ్గరగా ఉండటమే అని, మనం  దేవుని కనుగొనే  విశేష మార్గంకూడా ఇదే  అని అన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ గారు యునికూప్ ఫ్లోరెన్స్ మరియు "ది హార్ట్స్ మెల్ట్స్" ఫౌండేషన్ సభ్యులు చేస్తునటువంటి నిస్వార్థమైన సేవను కొనియాడుతూ "సమాజంలోని అణగారిన,  పేదరికం, ఒంటరితనం ఉన్న వారిని చేరదీస్తూ  వారికి  విద్య కల్పిస్తూ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న సేవ అమూల్యమైనది అని అన్నారు.

మరియు యాభై సంవత్సరాల క్రితం సహకార పునాదిని ప్రస్తావిస్తూ, పోప్ వినియోగదారుల ప్రయోజనాలను మరియు వారి ఆరోగ్యం మరియు భద్రతను, ముఖ్యంగా విద్యను మెరుగుపరచడం ద్వారా వారి పనిని  ప్రశంసించారు.
ముఖ్యంగా "యుద్ధంలో అమరవీరులైన ఉక్రెయిన్ ప్రజలకు "కి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాడు, ప్రత్యేకించి డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీతో వారి సహకారాన్ని అభినందించారు
చివరిగా  వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి, వనరులు మరియు నైపుణ్యాలను పంచుకోవడంలో   సమాజ వృద్ధికి బాటలు వేయాలని దీనికి  ప్రతి ఒక్కరు  నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.