ఘనంగా పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం

ఘనంగా పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం
విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరాంధ్రలో ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొత్తవలస మండలం, కొండడాబా లో "పరిశుద్ధ వ్యాకులమాత మహోత్సవం" ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ గొంగాడ రాజు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
సెప్టెంబర్ 15, ఆదివారం నాడు జరిగిన ఈ వేడుకలలో పండుగ మహోత్సవ కృతజ్ఞతా దివ్యబలి పూజను విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మరియు ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య డా|| జయరావు పొలిమెర గారు ఇతర గురువులతో కలసి సమర్పించారు.
వివిధ మేత్రాసనాలనుండి గురువులు , సిస్టర్స్ మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
ఈ దేవాలయానికి 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఫిబ్రవరి మొదటి ఆదివారం నిర్వహించే " కొండడాబా వ్యాకులమాత మహోత్సవం పండుగకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు . ఈ దేవాలయంలో 1914వ సంవ త్సరంలో పారిస్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించిన "వ్యాకులమాత ప్రతిమ"ను కులమతాలకు అతీతంగా ఆరాధించడం ఇక్కడి ప్రత్యేకత.
ఈ స్వరూపం కొండపైకి వెళ్లే మార్గంలో ప్రతిష్టించారు. ఈ స్వరూపం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తల్లి మరియమ్మ ఒడిలో సిలువ వేసి క్రిందకు దించిన యేసుక్రీస్తు వారి ప్రతిరూపంగా ఇది దర్శినమిస్తుంది. స్వరూపం వద్దకు వెళ్లి ప్రార్దించే వారి కోరికలు తీరుతాయని అక్కడ ప్రజలు చెబుతారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer