ఘనంగా క్రైస్తవుల సహాయమాత యాత్ర మహోత్సవం

mother mary
mother mary feast

ఘనంగా క్రైస్తవుల సహాయమాత యాత్ర మహోత్సవం - మరియగిరి పుణ్యక్షేత్రం

 శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం మంగళవారం కనులపండుగగా జరిగింది. వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ ను చూడటానికి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు.
శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతి మహా పూజ్య  రాయరాల విజయకుమార్ గారు ఇతర గురువులతో కలసి  పండుగ దివ్యపూజబాలి ని సమర్పించారు.  

తొమ్మిది  రోజులపాటు జరిగిన ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో  విశ్వాసులు పాల్గొన్నారు.   పాలకొండ, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, శ్రీకాకులం, తలవరం, తోడి, మరియగిరి, గంగాదం, నాగం, సంకిని, పాలవలస గ్రామాలలోని గురువులు, మఠకన్యలు, విశ్వాసులు హాజరయ్యారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారు 40వేల మంది భక్తులు వచ్చారు. కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి పూజలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు అర్పించడం జరిగింది.

 పుణ్యక్షేత్ర డైరెక్టర్, మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చల్ల డేవిడ్ గారు  మరియు మరియగిరి కార్యనిర్వాహక కమిటీ వారు  ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
సహాయమాత మహోత్సవం సందర్భంగా వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్ పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మహా పూజ్య  రాయరాల విజయకుమార్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మోసిగ్నోర్ గురుశ్రీ దూసి దేవరాజు గారు , గురువులు  గురుశ్రీ బోగీ సంజీవి గారు ,గురుశ్రీ పాల్ భూషణ్ గారు, గురుశ్రీ సుందర్ రావు గారు, గురుశ్రీ మరియాదాస్ గారు , గురుశ్రీ సెల్వరాజ్ గారు  ఇతర గురువులు పాల్గొన్నారు.
గురుశ్రీ చల్ల డేవిడ్ గారు పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి, వచ్చిన విశ్వాసులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer