Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
సకల పునీతుల పండుగ | All Saints Day
దేవుని యొక్క వాగ్దానానికి వేచి ఉండాలి ధన్యతగల జీవితమును జీవించడమే పునీత జీవితం, అదియే క్రైస్తవ జీవితము. పునీతులను గౌరవించు క్రమములో మన భక్తి కేవలం పునీతుల పటాల, స్వరూపాల అలంకరణతో ఆగిపోకూడదు. వారి జీవితం మనకు ఆదర్శం కావాలి. వారి అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నం చేయాలి.
ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన మన విశ్వ కతోలిక తల్లి శ్రీసభ సకల పునీతుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది . కాథలిక్ చర్చి యొక్క ముఖ్యమైన పవిత్ర దినం. ఈ రోజు చర్చి యొక్క పునీతులకు అంకితం చేయబడింది, అనగా స్వర్గం సాధించిన వారందరికీ.
క్రీస్తు స్వభావాన్ని ప్రవర్తనలో, పరిశుద్ధతలో ధరించి మంచి విశ్వాస జీవితాన్ని జీవించిన ఎందరో పునీతులు మనకు ఆదర్శము గా ఉన్నారు . పునీతునిగా జీవించుటకు ధైర్యము వహించు! ఇది గొప్ప ఆశయం, ఆదర్శం! మనం అలా జీవించగలమా? అని అంటే తప్పకుండా జీవించవచ్చు అని చెప్పవచ్చు.ఎవరు కూడా పునీతులుగా పుట్టరు. పునీతులుగా జీవించాలి. ఆ శక్తి మనలో ఉన్నది. జ్ఞానస్నానములో పవిత్ర జీవితమునకు పిలుపును అందుకొని యున్నాము. ఆ పిలుపునకు విశ్వాసముగా జీవించాలి.
ఈరోజు మన తల్లి శ్రీసభ పునీతుల యొక్క జీవితాలను మనకు ఆదర్శంగా చూపిస్తూ మన అందరిని కూడా వారి బాటలో నడవమని తెలియజేస్తూ ఉన్నది .
చరిత్ర చూసినట్లు ఐతే పోప్ గ్రెగొరీ III (731-741) రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాలోని పునీతులందరికీ వారి త్యాగానికి జ్ఞాపకార్థంగాను మరియు గౌరవార్ధంగాను ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు మరియు ఈ ఆలయాన్ని పునీతుల కొరకు సమర్పించారు. ఇలా సమర్పించిన తదుపరి ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీన సకల పునీతుల మహోత్సవాన్ని జరుపుకోవాలని పోప్ గ్రెగొరీ గారు ఆలయ పెద్దలను ఆదేశించారు . ఈ పండుగ మొదట రోమ్ నగరమునకు (డియోసెస్‌కు) మాత్రమే పరిమితం చేయబడింది, అయితే పోప్ గ్రెగొరీ IV (827-844) ఈ పండుగను మొత్తం విశ్వ శ్రీ సభ ఆనందోత్సాహాలతో కొనియాడాలని ఆదేశించారు మరియు దీనిని నవంబర్ 1నే అందరూ జరుపుకోవాలని ఆదేశించారు
Add new comment