'మేము భయంతో జీవిస్తున్నాము'

'మేము భయంతో జీవిస్తున్నాము': ఛత్తీస్‌గఢ్ సన్యాసినుల అరెస్టు క్రైస్తవ సమాజంలో ఆందోళనను రేకెత్తించింది

మత మార్పిళ్లు, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఛత్తీస్గఢ్లో ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను (సిస్టర్స్) అరెస్టు చేయడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో కేరళకు చెందిన ఇద్దరు కాథలిక్ సిస్టర్స్ (అస్సిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ సభకు చెందిన) - సిస్టర్స్ ప్రీతి మారీ మరియు సిస్టర్ వందన ఫ్రాన్సిస్ ను  సోమవారం అరెస్టు చేసారు.

మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు మత మార్పిడి నేరం కింద దుర్గ్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) శనివారం అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురిని JMFC కోర్టు ఆగస్టు 8 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. వారిపై BNS సెక్షన్ 143 (అక్రమ రవాణా) కింద కేసు నమోదు చేశారు. బజరంగ్ దళ్ ఫిర్యాదుతోనే అరెస్టు జరిగిందని అక్కడ ఉన్నవారు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కి చెందిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ దీనిని సమర్ధించారు. 

ఈ సిస్టర్స్ ఇద్దరు  కేరళకు చెందినవారు. వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. 

కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI), బాలికల తల్లిదండ్రుల నుండి వ్రాతపూర్వక సమ్మతి లేఖలు ఉన్నప్పటికీ, అస్సిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (ASMI)నుండి సన్యాసినులను అరెస్టు చేశారని తెలిపారు. 

నిన్న పార్లమెంట్ లో సిస్టర్స్ అరెస్టులో  బజరంగ్ దళ్ "బలవంతపు పాత్ర"ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూడీఎఫ్ ఎంపీల బృందం ప్లకార్డులు పట్టుకున్నారు. 

బజరంగ్ దళ్ బూటకపు ఫిర్యాదు ఆధారంగానే క్రైస్తవ సన్యాసినులను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అరెస్టు చేసిందని కేరళ సీఎం పినరయి విజయన్ గారు పేర్కొన్నారు. క్రైస్తవులపై సంఘపరివార్ వేధింపులకు ఇదో నిదర్శనమన్నారు.

యువతుల కుటుంబ సభ్యులు ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ "బలవంతపు మతమార్పిడి ఆరోపణను ఖండించారు. మహిళల అక్కలలో ఒకరు, "మా తల్లిదండ్రులు ఇప్పుడు బతికి లేరు. నా సోదరిని ఆగ్రాలో నర్సింగ్ ఉద్యోగం తీసుకోవడానికి సన్యాసినులతో పంపించాను. మరో బంధువు మాట్లాడుతూ, తన కుటుంబం ఐదేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి మారిందని, జూలై 24న తన సోదరి స్వచ్ఛందంగా వెళ్లిపోయిందని చెప్పారు. 

ఈ అరెస్టులపై భారతదేశం అంతటా క్రైస్తవ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, చర్చి నాయకులు మరియు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ఢిల్లీ మరియు కేరళలోని వివిధ జిల్లాలతో సహా అనేక నగరాల్లో నిరసనలు జరిగాయి. "రాజకీయ ఒత్తిడిలో అమాయక సన్యాసినులను వేధించడం" అని  దానిని ఖండిస్తూ బిషప్స్ అసోసియేషన్ ఒక బలమైన ప్రకటన విడుదల చేసింది.

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer