జీవితపు 'చివరి పరీక్ష' పేదల సంరక్షణపైనే ఉంటుంది: పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు

జీవితపు 'చివరి పరీక్ష' పేదల సంరక్షణపైనే ఉంటుంది: పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు

పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు  సోమవారం రోమ్‌లో తమ జనరల్ చాప్టర్‌లను నిర్వహిస్తున్న నాలుగు మత సమ్మేళనాల నాయకులతో సమావేశమయ్యారు.

డొమినికన్ మిషనరీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ సిక్స్టస్, సొసైటీ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, సిస్టర్స్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ మేరీ మోస్ట్ హోలీ ఇన్ ది టెంపుల్ మరియు సొసైటీ ఆఫ్ డివైన్ వోకేషన్స్ (వొకేషనిస్ట్ ఫాదర్స్) చాప్టర్ నాయకులతో ఈ సమావేశం జరిగింది.

ప్రజలు ఎన్ని యూనివర్శిటీ డిగ్రీలు సంపాదించారని దేవుడు చూడరు కానీ, వారు పేదల పట్ల ఎంత జాలి కలిగి వుంటారు  అని ఫ్రాన్సిస్ పాపు గారు  గురువులు  మరియు మతపరమైన మహిళల బృందానికి చెప్పారు. వివేచన, నిర్మాణం, దాతృత్వం అనే మూడు అంశాలపై మాట్లాడారు.

'నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి?' 'ఎన్ని పనులు సాధించారు?' లేదు, లేదు, నేను ఆకలితో ఉన్నాను మరియు మీరు నాకు త్రాగడానికి నీరు ఇచ్చారు కాబట్టి నాతో రండి... నేను బాధలో ఉన్నాను  మరియు మీరు నన్ను రక్షించారు. ఈ విధంగానే  మన చివరి పరీక్షలో మనకు తీర్పు  ఇవ్వబడుతుంది," అని మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు  ఆగస్టు 12న నాలుగు మత సమ్మేళనాల నాయకులతో  చెప్పారు.

శ్రీసభకి వారి అంకితభావం మరియు సేవకు మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు తన కృతజ్ఞతలు తెలిపారు.

మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే ఆనందాన్ని కూడా ఫ్రాన్సిస్ పాపు గారు తెలియజేసారు , "మంచి నిర్ణయం తీసుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది" అని ఈసందర్భముగా  చెప్పారు.

చివరిగా  మతపరమైన సమ్మేళనాల మిషన్లలో దాతృత్వం యొక్క పునాది పాత్రను అతను వివరించారు. మనం పేదలకు ఇచ్చే ప్రతి బహుమతిలో, దేవుని ప్రేమ యొక్క ప్రతిబింబం ఉంటుంది" అని మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు  నొక్కిచెప్పారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer