బంగ్లాదేశ్ లో మతాంతర సంభాషణ సదస్సు 

బంగ్లాదేశ్
మతాంతర సంభాషణ సదస్సు

క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కోసం రాజ్‌షాహి మేత్రాసన కమీషన్ బంగ్లాదేశ్ లో మే 24 న నవోగావ్ జిల్లాలోని ధమోయిర్‌హత్ ఉపజిల్లా ఆడిటోరియంలో విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనంపై ఇతర మత పెద్దలతో సంభాషణ సెమినార్‌ను నిర్వహించింది.

సెమినార్ పవిత్ర ఖురాన్, గీత మరియు బైబిల్ నుండి పఠనంతో ప్రారంభమయింది, తరువాత జ్యోతి ప్రజ్వలన జరిగింది.

క్రిస్టియన్ యూనిటీ అండ్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ కమిషన్ అధిపతి గురుశ్రీ  పాట్రిక్ గోమ్స్ మాట్లాడుతూ, "ఇంటర్‌ఫెయిత్ డైలాగ్ సెమినార్ ఉల్లాసంగా ఉంది, మరియు ఈ భూమిపై మనమంతా ఒకే సృష్టికర్త యొక్క జీవులమని మరియు మనమందరం సోదరులమని" అన్నారు.

"కాబట్టి, మనమందరం అన్ని మతాల ప్రజలను గౌరవించాలి. అప్పుడే విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనం చేయవచ్చు" అని ఆయన ఉపోఘాటించారు.

ఒక ఓపెన్ ఫోరమ్ రెండు సమస్యలకు సంబంధించి నిర్వహించబడింది: ఒకటి వారి ప్రాంతంలో శాంతియుతంగా జీవించడం గురించి, మరొకటి బాలల రక్షణ మరియు చిన్న వయస్సులో జరిగే వివాహాలను ఆపడం.

ఈ అంశంపై రిసోర్స్ పర్సన్లు ఏకగ్రీవంగా ప్రసంగించారు మరియు సెమినార్ నివేదికలను పాల్గొనేవారికి చదివి వినిపించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌అతిథిగా విచ్చేసిన పార్ల‌మెంట‌ర్ స‌భ్యులు, ఎండీ సాహిదుజ్జ‌మాన్ స‌ర్కార్ మాట్లాడుతూ పవిత్ర ఖురాన్, ప్ర‌వ‌క్త మ‌హ‌మ్మ‌ద్ జీవితం వెలుగులో శాంతియుతంగా జీవించాల‌ని అన్నారు.

ముస్లింలు మెజారిటీ అయినప్పటికీ, ఇతర మతాలను ప్రజలు గౌరవించాలని కూడా ఆయన అన్నారు.

దేశంలో సర్వమత వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తోందని సర్కార్ ప్రస్తావించారు.

ఇతర గౌరవ అతిధులుగా ఉపజిల్లా పరిషత్ చైర్మన్ Md. అజహర్ అలీ, Md. అరిఫుల్ ఇస్లాం, ఉపజిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాన్యుల్ హస్దక్, వరల్డ్ విజన్ బంగ్లాదేశ్ మేనేజర్, దామోయ్ర్హాట్  ఏరియా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, Md. ముజమ్మిల్ హక్, మరియు గురుశ్రీ మైఖేల్ కొర్రయా, కాథలిక్ మిషన్ ఆఫ్ బెనీద్వార్ విచారణ గురువులు విచ్చేసారు.