జాతీయ నిరసన దినం - బ్లాక్ డే
జాతీయ నిరసన దినం - బ్లాక్ డే
భారత దేశంలోని క్రైస్తవులు మరియు ముస్లిములు 1950 లో భారత రాజ్యాంగం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 10 న ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు.
10 ఆగష్టు 1950 న అప్పటి భారత దేశ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జారీ చేసిన షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల ఉత్తరువుల ప్రకారము హిందుత్వం కాకుండా మరొక మతాన్ని ఆచరించే వారు ఎవరైనా దళితులుగా పరిగణించబడరని తేల్చడం జరిగింది.
కాగా 1956 లో సిక్కులను మరియు 1990 లో బౌద్ధులను కూడా షెడ్యూల్ కులాలు గా గుర్తిస్తూ షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల ఉత్తరువులను సవరించడం జరిగింది. కానీ క్రైస్తవులను మరియు ముస్లిములను మాత్రం నిర్లక్ష్యం చేసారు. దళిత క్రైస్తవులు మరియు ముస్లిముల పట్ల భారత రాజ్యాంగం చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ ఈ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారు.
దీనిని వ్యతిరేకిస్తూ 2009 నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 10 వ తారీఖును క్రైస్తవ మరియు ముస్లిము సంఘ పెద్దలు దేశ ప్రధానికి మరియు అధ్యక్షునకు మెమోరాండా సమర్పిస్తారు.
ఈ రోజు కూడా (ఆగష్టు 10 ) బ్లాక్ డే వివిధ ప్రాంతాలలో నిర్వహించారు.\
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer