విశాఖ అతిమేత్రాసనం లో ఘనంగా 'ఇండియన్ క్రిస్టియన్ డే'

విశాఖ అతిమేత్రాసనం లో ఘనంగా 'ఇండియన్ క్రిస్టియన్ డే'
జూలై 3, 2025 న పునీత తోమస్ వారి పండుగ సందర్భంగా కేథలిక్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్టణం "భారతీయ క్రైస్తవ దినోత్సవం"(Indian Christian Day) ను విశాఖపట్టణం అతిమేత్రాసనంలోని పాస్ట్రల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేథలిక్ అసోసియేషన్ సభ్యులతో పాటు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
కేథలిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు గారు సభికులకు ఆహ్వానం పలుకుతూ 'ఇండియన్ క్రిస్టియన్ డే' ప్రాముఖ్యత తెలుపుతూ, భారత దేశ క్రైస్తవులందరు జాతీయ దినోత్సవాలు కొనియాడే విధంగా ఈ దినోత్సవాన్ని కూడా కొనియాడాలని పిలుపునిచ్చారు.
పాస్ట్రల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ప్రేమ్ కుమార్ గారు పునీత తోమస్ వారి జీవితాన్ని ప్రస్తుత మానవ జీవితానికి అన్వయిస్తూ, ప్రధానంగా (యోహాను 11:16) "మనము కూడా వెళ్ళి ఆయనతోపాటు చనిపోవుదుము" ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ నాయకులు ఇదే విధమైన తెగువ ప్రదర్శించాలని స్ఫూర్తివంతమైన సందేశం అందించారు.
క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కోర్ కమిటీ మెంబర్ రెవ. పాస్టర్ కొర్నేలియుస్ గారు, విమెన్ కమిషన్ ప్రెసిడెంట్ బేతా లూర్ధు రాణి గారు, కేథలిక్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోన స్వామినాధం గారు క్రైస్తవ శాఖల మధ్య ఐక్యత గురించి తమ సందేశాలను అందించగా, సెక్రెటరీ బేతా జోసెఫ్ గారి సారధ్యంలో కార్యవర్గ సభ్యులు పల్లికల రవి ఆల్బర్ట్, పెంటపల్లి ముక్తి ప్రకాష్, కప్పరెడ్డి చంద్రరావు, కణితి నాగరాజు గార్లు వివిధ క్రైస్తవ శాఖల ప్రతినిధులను కతోలిక సంఘాలతో సమన్వయ పరుస్తూ 'ఇండియన్ క్రిస్టియన్ డే' విజయవంతం అవడానికి కృషి చేశారు.
- బి.వి.రవీంద్ర శేషుబాబు
ప్రెసిడెంట్, AICU -VIZAG
Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer