పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజల ప్రాథమిక హక్కులను కొరకు మరియు లక్షలాది మంది ప్రజల శాంతి కోసం చేస్తున్న కేకలు వినాలని ప్రభుత్వ నాయకులను కోరారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కొనసాగుతున్న హింసాకాండలో సెయింట్ గ్రెగోరీస్ స్కూల్ మరియు కాలేజీ పై దాడి జరిగింది. నవంబరు 24న కతోలిక విద్యాసంస్థపై ఒక విద్యార్థుల బృందం దాడి చేసింది. దాడి చేయడంతో తరగతులను నిలిపివేయాల్సి వచ్చింది.
భారతదేశంలోని ఇంఫాల్‌కు చెందిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లినస్ నెలి గారు సంఘర్షణతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి మతపరమైన మరియు జాతి హింసాకాండను ఎదుర్కోవడంలో వారికి "నిజంగా సహాయం కావాలి" అని అన్నారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం "ఆమోదయోగ్యం కాదు" - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు సీనియర్ హిజ్బుల్లా కమాండర్లు మరణించారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడం "ఆమోదయోగ్యం కాదు" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పేర్కొన్నారు.