" సహాయం కావాలి"- మహా పూజ్య లినస్ నెలి గారు
" సహాయం కావాలి"- మహా పూజ్య లినస్ నెలి గారు
భారతదేశంలోని ఇంఫాల్‌కు చెందిన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లినస్ నెలి గారు సంఘర్షణతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి మతపరమైన మరియు జాతి హింసాకాండను ఎదుర్కోవడంలో వారికి "నిజంగా సహాయం కావాలి" అని అన్నారు.
"రెడ్ వీక్," లేదా "వీక్ ఆఫ్ విట్‌నెస్" అని పిలవబడే పాంటిఫికల్ స్వచ్ఛంద సంస్థకు అతిథిగా పీఠాధిపతులు ఐర్లాండ్‌ను సందర్శించారు.
ఐర్లాండ్‌లోని OSV న్యూస్‌తో మాట్లాడుతూ, డబ్లిన్ మరియు బెల్‌ఫాస్ట్‌లోని సమ్మేళనాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మహా పూజ్య లినస్ నెలి గారు ఈశాన్య భారతదేశంలోని మణిపూర్‌లో పరిస్థితులు "చాలా కఠినంగా ఉన్నాయి" అని అన్నారు.
మణిపూర్‌లో హింస బాగా పెరిగిపోయింది. కోపం, ద్వేషం మరియు పగ తో ...అది ఇంకా పరాకాష్టలో ఉంది" అని ఆయన వివరించారు.
"గత వారం మహిళలు మరియు పిల్లలతో సహా 10 మందికి పైగా ప్రజలు అపహరణకు గురయ్యారు మరియు జాతి ఘర్షణలలో చంపబడ్డారు అని, ఎక్కువగా క్రైస్తవులు ఉన్న కుకీ ప్రజలకు మరియు హిందూ మెజారిటీ గ్రూపు అయిన మైతేయి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి అని పీఠాధిపతులు తెలిపారు.
"మే 2023లో, ఈ రెండు వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణల ఫలితంగా వందలాది మంది మరణించారు మరియు 60,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో మగ్గుతున్నారు," అన్నారాయన.
"ఒంటరిగా నిలబడటం చాలా కష్టం" అని దేవాలయ సహాయక చర్యల గురించి చెప్పాడు. "ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు, మరియు మేము నిస్సహాయంగా మరియు నిరాశకు గురవుతున్నాము. బాధితులు బాధపడుతున్నారు, వారు అలసిపోయారు. దేవాలయ మరియు స్వచ్చంద సంస్థలు అలసిపోయాయి, వారు చాలా చేస్తున్నారు. డిమాండ్లు పెరుగుతున్నాయి కాబట్టి మాకు నిజంగా సహాయం కావాలి అని మహా పూజ్య లినస్ నెలి గారు కోరారు.
మణిపూర్ జనాభా దాదాపు 3.3 మిలియన్లు. మైతేయి జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు, దాదాపు 43 శాతం మంది కుకీలు మరియు నాగాలు, ప్రధానమైన మైనారిటీ తెగలు గా వున్నాయి.
ఈశాన్య భారత రాష్ట్రంలోని క్రైస్తవులకు ఆర్థిక, నైతిక మరియు ఆధ్యాత్మిక మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తూ, అక్టోబర్ 2023లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 67 ఏళ్ల మహా పూజ్య లినస్ నెలి గారిని నియమించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer