శాంతి కొరకు ప్రార్ధించండి - కార్డినల్స్

శాంతి కొరకు ప్రార్ధించండి - కార్డినల్స్
సార్వత్రిక సమావేశం (General Congregation) కోసం సమావేశమైన కార్డినల్స్, యుద్ధ ప్రాంతాలలో శాంతి ఒప్పందాలు కుదరకపోవడాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాన్క్లేవ్ ప్రారంభానికి ముందు సార్వత్రిక సమావేశంలో సమావేశమైన కార్డినల్స్, ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం మరియు ప్రపంచంలోని అనేక ఇతర యుద్ధ ప్రాంతాలలో శాంతి కొరకు జరుగుతున్న ప్రయత్నాలలో ఎటువంటి పురోగతి సాధించలేదని విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
మే 6న హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటనలో, "దాడులు - ముఖ్యంగా పౌర జనాభాకు హాని కలిగించేవి - తీవ్రమయ్యాయి" అని పేర్కొంది.
"సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారి తీయాలని, మరియు శాంతి చర్చలు జరపాలని కార్డినల్స్ " హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈసందర్బముగా కార్డినల్స్ విశ్వాసులను "న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతి కోసం ఆ దేవాది దేవుని ప్రార్ధించాలని కోరారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer