'యుద్ధం సమస్యలను పరిష్కరించదు' - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
'యుద్ధం సమస్యలను పరిష్కరించదు' - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2024 అడ్వెంట్ సీజన్ యొక్క మొదటి సాధారణ ప్రేక్షకుల సమావేశంలో ప్రపంచంలో శాంతి కోసం తన విజ్ఞప్తిని పునరుద్ధరించారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంఘర్షణల మధ్య, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రత్యేకంగా " ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ మరియు మయన్మార్" కోసం ప్రార్థించారు. ఈ దేశాల్లో జరుగుతున్న యుద్ధంవల్ల “చాలా మంది పిల్లలు చనిపోయారు, చాలా మంది అమాయకులు చనిపోయారు” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
"యుద్ధం చెడ్డది అని , యుద్ధం నాశనం చేస్తుంది" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు హెచ్చరించారు. మరోసారి శాంతి కోసం తన పిలుపును పునరుద్ధరించాడు. ప్రతి ఒక్కరినీ ఎల్లప్పుడూ ప్రార్థించమని ప్రోత్సహించారు. "ప్రభువు మనందరికీ శాంతిని తీసుకురావడానికి మనం ప్రార్థిద్దాం" అని పాపు గారు అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer