విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
పరాగ్వేలోని యువ మంత్రుల సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా' సమర్పించాలని పిలుపునిచ్చారు.
విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరవల్లి విచారణ, జన్నివలసలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ దేవాలయాన్ని "పునీత అంతోని వారి దేవాలయం " గా నామకరణం చేసారు.