ఘనంగా ఫాతిమామాత మహోత్సవములు


ఘనంగా ఫాతిమామాత మహోత్సవములు
ఏలూరు మేత్రాసనం, ఫాతిమాపురంలోని ఫాతిమా మాత దేవాలయంలో ఫాతిమామాత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విచారణ గురువులు ఫాదర్. జయప్రకాశ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
మే 12న ప్రత్యేక సువార్త స్వస్థత ప్రార్ధన కూటములు నిర్వహించారు. విశాఖ డివైన్ ధ్యాన కేంద్ర డైరెక్టర్ ఫాదర్ మరియదాస్ V.C, గారు మరియు వారి బృందం అత్యంత భక్తిశ్రద్ధలతో సువార్త స్వస్థత ప్రార్ధన కూటములును నడిపించారు. ఫాదర్ మరియదాస్ గారు ఆరాధనను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్రదర్ సత్యం గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసారు . ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer