కార్డినల్స్ పోప్ ఫ్రాన్సిస్ సమాధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు

కార్డినల్స్ పోప్ ఫ్రాన్సిస్ సమాధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు
ఈస్టర్ రెండవ ఆదివారం మధ్యాహ్నం, కార్డినల్స్ మరియు కళాశాల సభ్యులు సెయింట్ మేరీ మేజర్ బసిలికాకు వెళ్లి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి సమాధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
బసిలికా కోఅడ్జుటర్ ఆర్చ్ప్రిస్ట్, లిథువేనియన్ కార్డినల్ రోలాండా మాక్రికాస్ గారి నేతృత్వంలో సాయంత్రం కాల ప్రత్యేక ప్రార్థనలు (vespers ) కోసం సమావేశమయ్యారు.ఆ సమయంలో కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికు నివాళులర్పించడానికి ప్రజలు వస్తూనే ఉన్నారు.
ఉదయం ఏడు గంటల నుండి అధికసంఖ్యలో ప్రజలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. తెల్లవారుజాము నుండి ఇరవై వేల మందికి పైగా సమాధిని సందర్శించారని అధికారులు అంచనా .
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer