XIV లియో పోప్ మొట్ట మొదటి సామాన్య ప్రేక్షకుల సమావేశం

మే 21 ,2025 న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో  పోప్ లియో XIV తన మొదటి సామాన్య ప్రేక్షకుల సమావేశంలో పాల్గొన్నారు.

“విత్తువాని ఉపమానముపై పోప్ లియో XIV ప్రసంగిస్తూ "ఈ ఉపమానం ఎంతో ప్రత్యేకమైనదని దీని ద్వారా ఏసుక్రీస్తు సువార్తను ఎలా బోధించాలో మనకు మార్గదర్శకత్వం చేస్తున్నారని అన్నారు. 

ఉపమానాలు పరలోక సంబంధమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, దైవ జ్ఞానంలో ఎదగడానికి దోహదపడతాయని పొప్ పేర్కొన్నారు. 

సువార్త లోని ప్రతి మాట మన హృదయాలలో, జీవితాలలో నాటబడిన విత్తనం లాంటిదని ఆయన అన్నారు.

దైవవాక్కును ఆలకిస్తూ, విశ్వసించేవారిలో ఆ విత్తనం ఫలిస్తుందని పొప్ పేర్కొన్నారు.

నెల క్రితం దైవ సన్నిధికి చేరుకున్న స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ గారిని పోప్ లియో క్సివ్ స్మరించుకున్నారు