“వాటికన్‌లో 100 జనన దృశ్యాలు” ప్రదర్శన
“వాటికన్‌లో 100 జనన దృశ్యాలు” ప్రదర్శన
వ్యాటికన్‌లో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా నిర్వహించే “100 జనన దృశ్యాలు”(Nativity Scenes) అనే అంతర్జాతీయ ప్రదర్శన డిసెంబర్ 8న ప్రారంభంకానునది. ఈ ప్రదర్శన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లోని బెర్నిని కొలొనేడ్ (Bernini's Colonnade) క్రింద ఏర్పాటు చేయబడుతుంది.
"జూబ్లీ ఈజ్ కల్చర్" అనే సాంస్కృతిక కార్యక్రమాల శ్రేణిలో భాగమైన ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కటి మన ప్రభువైన యేసుక్రీస్తు జనన తెలిపే 100 విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కళాకారులు వీటిని తయారు చేసారు.
డికాస్టరీ ఫర్ ఎవాంజెలైజేషన్ ప్రో-ప్రిఫెక్ట్ మరియు జూబ్లీ ఆర్గనైజేషన్ అధిపతి అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య రినో ఫిసిచెల్లా గారు మరియి డికాస్టరీలోని ఇతర సభ్యులతో కలిసి ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు. మెక్సికో రాయబార కార్యాలయం హోలీ సీకి నిర్వహించే సాంప్రదాయ జానపద ప్రదర్శన కూడా ప్రదర్శించబడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 దేశాలు 132 జనన దృశ్యాలను ప్రదర్శించనున్నాయి. వాటిలో క్రొయేషియా, రొమేనియా, పెరూ, ఎరిట్రియా మరియు తైవాన్ ఉన్నాయి. జపనీస్ కాగితం, పట్టు, రెసిన్, ఉన్ని, కొబ్బరి మరియు అరటి ఫైబర్స్ మరియు గాజు వంటి అనేక రకాల పదార్థాలను ఈ జనన దృశ్యాలలో ఉపయోగించారు.
ఈ ప్రదర్శన డిసెంబర్ 8 నుండి జనవరి 8, 2026 వరకు తెరిచి ఉంటుంది.సందర్శకులకు ప్రవేశం ఉచితం.
Article By M kranthi swaroop