అంకారాలోని అటాతుర్క్ సమాధిని సందర్శించిన పోప్ లియో
గురువారం నవంబర్ 27 ఉదయం అంకారా అంతర్జాతీయ విమానాశ్రయంలో పోప్ లియోకు అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది.
వెంటనే మంత్రి వర్గం, ఉప గవర్నర్ మరియు సహా అధికార ప్రతినిధి బృందంతో కలిసి పోప్ లియో అటాతుర్క్ స్మారక సమాధిని సందర్శించారు.
టర్కిను సందర్శించగలిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను,ఈ దేశ ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సు సమృద్ధిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను" అని పోప్ సమాధి గౌరవ పుస్తకంపై సంతకం చేసారు.
పోప్ లియో తన 6 రోజుల టర్కి మరియు లెబనాన్ పర్యటనలో మొదటి రోజు.
ఈ స్మారక చిహ్నం టర్కీలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది
టర్కిష్ జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి, 1923లో టర్కియే రిపబ్లిక్‌ను స్థాపించినందుకు మరియు దాని మొదటి అధ్యక్షుడిగా పనిచేసినందుకు Mustafa Kemal Atatürk "టర్క్‌ల పితామహుడు"గా గౌరవించబడ్డాడు.
ఈ ప్రదేశం టర్కీ రెండవ అధ్యక్షుడు İsmet İnönü చివరి విశ్రాంతి స్థలం కూడా, 1973లో మరణించిన తర్వాత అక్కడే ఖననం చేయబడ్డారు.