ICYM రజత జూబ్లీ వేడుకలను అధికారికంగా ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ కాథలిక్ యూత్ కమిషన్ మార్చి 15న జరిగిన ప్రాంతీయ డైరెక్టర్ల సమావేశం 2025 సందర్భంగా ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ (ICYM) రజత జూబ్లీ వేడుకలను అధికారికంగా ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి యువతా విభాగ అధ్యక్షులు మహా పూజ్య ఇమ్మాన్యుయేల్ కెర్కెట్టా DD, ప్రాంతీయ యువతా డైరెక్టర్ రెవరెండ్ బిషప్ పాల్ టోప్పో, ఛత్తీస్‌గఢ్ ప్రాంత యువతా లీడర్లు   హాజరయ్యారు.

ఈ ప్రాంతంలోని అన్ని మేత్రాసనాల ICYM పతాకాలను మరియు ప్రాంతీయ బృందం అందించిన జూబ్లీ సిలువను మహా పూజ్య పాల్ టోప్పో ఆశీర్వదించారు.

REXCOలు మరియు DEXCOల సహకారం ద్వారా ప్రారంభోత్సవం సాధ్యమైంది.