2028లో పోస్ట్ సినడల్ ఎక్లెసియల్ అసెంబ్లీ స్నాతకోత్సవానికి ఆమోదం తెలిపిన పోపు ఫ్రాన్సిస్

మూడు సంవత్సరాల సినడ్ ప్రక్రియ అమలు మరియు దాని ఫలితాల అంచనా సందర్బంగా  2028 అక్టోబర్‌ వాటికన్‌లో ప్రత్యేక పోస్ట్ -సినడల్ ఎక్లెసియల్ అసెంబ్లీని నిర్వహిస్తున్నట్లు  సినడ్ జనరల్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మారియో గ్రెచ్ (Mario Grech) ప్రకటించారు.

ఈ ప్రక్రియ మూడు సంవత్సరాల "సినడ్ శ్రీసభ: ప్రేషితకార్యము కొరకు భాగస్వామ్యంతో  కొనసాగడం" అనే అంశంపై  అమలు పరచి అక్టోబర్ 2024లో ముగిసిన దశను సూచిస్తుంది.

వివేచన మరియు నిర్ణయాధికారంతో సినడ్ తుది పత్రంలోని  మార్గదర్శకాలను "స్థానిక శ్రీసభ మరియు శ్రీసభ సమూహాలు" అమలు చేయడానికి" కట్టుబడి ఉండాలి అని కార్డినల్ గ్రెచ్ తెలియచేసారు .

2027 మొదటి మరియు రెండవ సెమిస్టర్ల పై సమీక్షా సమావేశాలు మేత్రాసనాలు, ఎఫార్కీలు, జాతీయ మరియు అంతర్జాతీయ ఎపిస్కోపల్ సమావేశాలు, తూర్పు క్రమానుగత నిర్మాణాలు మరియు ఇతర శ్రీసభ సమూహాలలో జరుగుతాయి.

2028 మొదటి మరియు రెండవ సెమిస్టర్లు ఖండాంతర సమీక్షా సమావేశాలు ఇన్‌స్ట్రుమెంటమ్ లేబరిస్ (Instrumentum laboris ) ప్రచురణకు దోహదపడతాయి అని కార్డినల్ మారియో వివరణ ఇచ్చారు