స్కాండినేవియన్ క్రైస్తవులు ఐక్యతకు సాక్షులుగా ఉండాలన్న పొప్ ఫ్రాన్సిస్
సోమవారం ఫిబ్రవరి 3 న స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్ మరియు ఐస్లాండ్ నుండి వచ్చిన యాత్రికుల బృందాన్ని ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించారు,
ఈ జూబ్లీ తీర్థయాత్ర విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమలో పెరగడానికి ఒక అవకాశం అని పొప్ అన్నారు
ఐరోపా,ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధాల మధ్య సయోధ్య మరియు శాంతి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీ ఇతివృత్తమైన “నిరీక్షణా యాత్రికులు” గురించి ప్రస్తావిస్తూ, అక్కడ ఉన్నవారు తమ రోమ్ సందర్శనను ఉపయోగించి తమ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలని, ముఖ్యంగా సెయింట్స్ పీటర్ మరియు పాల్ సమాధులను సందర్శించాలని పోప్ కోరారు.
రోమ్ సందర్శించి ఇంటికి తిరిగి వెళ్ళాక వారి ప్రయాణం ముగియదని, తమ సువార్త ప్రచారాన్ని వారి దైనందిన జీవితంలో కొనసాగించాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించారు.
స్కాండినేవియాలోని కతోలికులు సయోధ్య, స్వస్థత మరియు శాంతికి సాక్ష్యమివ్వడంలో ఇతర క్రైస్తవ వర్గాలతో సహకరించాలని పొప్పి ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు