సెలేసియన్లు యువతకు క్రీస్తు పట్ల మక్కువ పెంచాల్లన్న పొప్ ఫ్రాన్సిస్

డాన్ బాస్కో సెలేసియన్లు వారి స్థాపకుడు అర్జెంటీనాకు మొదటి మిషనరీ యాత్ర చేసి 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఫిబ్రవరి 16 నుండి ఏప్రిల్ 12 వరకు ఇటలీలోని టురిన్‌లో తమ 29వ జనరల్ చాప్టర్‌ను నిర్వహిస్తున్నారు.

తన వాటికన్ నివాసంలో ద్వైపాక్షిక న్యుమోనియా నుండి కోలుకుంటున్న సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ సొసైటీ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ సభ్యులకు ఒక సందేశాన్ని పంపారు.

సెలేసియన్ సభ నూతన రెక్టర్ మేజర్‌గా చాప్టర్ ఎన్నుకున్న ఫాదర్  Fr. Fabio Attardను పొప్ ఏ సందేశాన్ని పంపారు. ఈయన మాల్టాలో జన్మించారు.

సేల్సియన్లు సినడల్ వివేచన, నమ్మకం మరియు నిబద్ధతతో పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు  రాబోయే సంవత్సరాలకు తమ లక్ష్యాన్ని రూపొందించుకోవాలని పోప్ ప్రోత్సహించారు.

సెలేసియన్లు ప్రపంచ వ్యాప్తంగా యువతకు, విద్యను అందించడానికి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపి, పట్టుదలతో కొనసాగమని ఆ సభ వారిని పొప్ ప్రోత్సహించారు.

సెలేసియన్ల అధ్యాయ పనిని, అలాగే ఐదు ఖండాలలోని మీ సహచరులను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను అని పొప్ ఫ్రాన్సిస్ ముగించారు.