సినడ్ సమాలోచన సభలో ఇద్దరు మహిళలను నియమించిన పొప్ ఫ్రాన్సిస్
డిసెంబర్ 13న, పోప్ ఫ్రాన్సిస్ సినడ్ 16 వ సాధారణ సమాలోచన సభ సభ్యులను నియమించారు.
డిసెంబరు 4 నాటి నియామకాలను వాటికన్ ప్రెస్ ఆఫీస్ వారు శుక్రవారం ప్రకటించారు.
డికాస్టరీ ఫర్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ కన్సెక్రేటెడ్ లైఫ్ అండ్ సొసైటీస్ ఆఫ్ అపోస్టోలిక్ లైఫ్ సెక్రటరీ సిస్టర్ సిమోనా బ్రాంబిల్లా మరియు డికాస్టరీ ఫర్ బిషప్‌లు సభ్యురాలు మరియా లియా జెర్వినో లు పోప్ ఫ్రాన్సిస్ నియమించిన సభ్యులలో ఉన్నారు
వీరిలో లక్సెంబర్గ్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ జీన్-క్లాడ్ SJ గారు అక్టోబర్ 2023 మరియు 2024లో జరిగిన సినడ్ రెండు సభలకు రిలెటర్ గా ఉన్నారు
డిసెంబర్ 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్న కొత్త సామాన్య సభ సభ్యులు , సినడల్ ప్రక్రియను అమలు చేయడంలో మరియు తదుపరి సినడ్‌ను సిద్ధం నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.