శ్రీసభ శిక్షా ఆంక్షలను పరిష్కరించేందుకు భారతీయ కాననిస్టుల సమావేశం

ది కానన్ లా సొసైటీ ఆఫ్ ఇండియా (CLSI)  37వ వార్షిక సమావేశం గౌహతిలోని నార్త్ ఈస్ట్ డియోసెసన్ సోషల్ సర్వీస్ సొసైటీ (NEDSSS)లో అక్టోబరు 14 న ప్రారంభమై అక్టోబర్ 18 వరకు కొనసాగనున్నాయి 

ఈ సమావేశంలో "శ్రీసభ శిక్షా ఆంక్షలు" అనే క్లిష్టమైన ఇతివృత్తంపై దృష్టి సారించనున్నారు

ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో  దేశవ్యాప్తంగా ఉన్న 130 మందికి పైగా గురువులు,మఠకన్యల మరియు శ్రీసభ ధర్మశాస్త్ర న్యాయవాదులను సమావేశపరిచారు.

ఈశాన్య ప్రాంతంలో ఇది మొదటిసారి జరుగుతున్న సదస్సు అని CLSI ప్రెసిడెంట్ గురుశ్రీ  డాక్టర్ టి. లూర్దుసామి అన్నారు 

ఈశాన్య బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , శ్రీసభ ధర్మశాస్త్ర  విభాగ ఛైర్మన్ గురుశ్రీ ఆల్బర్ట్ హెమ్రోమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు.

హాజరైన ప్రతి వ్యక్తి గారో సంచులను మరియు అస్సామీ గామోసాలను అతిథి సత్కారము స్వీకరించారు.

“CLSI ని ఆరంభించిన 36 సంవత్సరాలు అయినప్పటికీ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలగుండా ప్రయాణం చేసిన తరువాత,ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది " అని  గురుశ్రీ లూర్దుసామి సమావేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు.

ClSI వ్యవస్థాపక అధ్యక్షుడు కార్డినల్ ఆస్వాల్డ్ గ్రాసియాల నుండి వచ్చిన ఒక వీడియో సందేశం, శ్రీసభ శిక్షాస్మృతిలో మార్పుల పై  కాననిస్టులు ఎప్పటికప్పుడు నవీకరించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

తన కీలకోపన్యాసంలో, గౌహతికి అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జాన్ మూలాచిరా శ్రీసభలో శిక్షాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని చర్చించి, ఇవి చివరి ప్రయత్నంగా ఉండకూడదని ఆయన అన్నారు 

మొదటి సెషన్‌లో ఇంఫాల్‌కు అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లీనస్ నెల్లి  శ్రీసభలో జరిమానా ఆంక్షల పరిణామం గురించి, 1917లో శ్రీసభలో శిక్షా చట్టం సవరణ తర్వాత క్రమంగా జరిమానాల తగ్గింపు గురించి చర్చించారు.

శ్రీసభ సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా ఉండవలసిన అవసరాన్ని వివరిస్తూ , "నూతన శిక్షా నియమాలు, నష్టపరిహారం మరియు రక్షిత ప్రయోజనాల కోసం ఉద్దేశించబడ్డాయి" అని పేర్కొన్నారు.

శిక్ష కంటే న్యాయం మరియు న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలనే bharathadesha  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టిని ప్రస్తావించారు.

2012 నాటి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) చట్టానికి సంబంధించిన చట్టాలపై దృష్టి సారిస్తారు .

"ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్" చిత్రం యొక్క ప్రదర్శనతో రోజు ముగిసింది.

కీలక అంతర్దృష్టి, సహకార వ్యూహాలతో  శ్రీసభ ధర్మశాస్త్ర న్యాయవాదులను సిద్ధం చేయడానికి, శ్రీసభ సమగ్రతను కాపాడటానికి శిక్షా ఆంక్షలను అర్థం చేసుకోవడాని బలోపేతం చేయడానికి ఈ సమావేశం రూపొందించబడింది.