విశాఖపట్నంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

భారత చెరసాల పరిచర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఫిబ్రవరి 22,2024 న విశాఖపట్నం అగ్రపీఠంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మేధావులు, అనుభవజ్ఞులు, చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు పాల్గొని వారి అమూల్యమైన సూచనలను సలహాలను ఇచ్చారు.

విశాఖపట్టణ మేత్రాసన సమన్వయకర్త గురుశ్రీ యన్నం జాకబ్ గారి సారధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త గురుశ్రీ పసల లహస్త్రాయ గారి అద్యక్షతన  ఈ సమావేశం జరిగింది..

ఈ చెరసాల పరిచర్య  సమావేశం "పరిశుద్ధ పోపు గారి 2025 జూబిలీ సంవత్సర సందర్బంగా  మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్  మహా పూజ్య అంతోని పూల గారి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని RVA తెలుగు విభాగానికి తెలియచేసారు.

Tags