బాంబినో గెసులో చికిత్స పొందుతున్న చిన్నారులు.

గాజా నుండి ఇరవై మంది పిల్లలు ఇప్పుడు రోమ్ లోని "పోప్ హాస్పిటల్" అని పిలువబడే బాంబినో గెసులో చికిత్స పొందుతున్నారు.

ఆగస్టు 14న, ముగ్గురు పిల్లలు తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలో రోమ్‌కు వచ్చారు. వారి తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు వారితో పాటు వచ్చారు. 

వారిలో  6 నెలలు మరియు 13 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు మరియు 2 సంవత్సరాల బాలిక ఉంది.

అక్టోబర్ 2023 నుండి, ఇటలీలోని ఈ పిల్లల వైద్య సెంటర్ గాజా నుండి వచ్చిన పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో కాలిన గాయాలతో  మరియు పోషకాహార లోపంతో ఆసుపత్రిలో చేరుతారు 

గాజా నుండి పిల్లలను స్వీకరించాలని మొదట బాంబినో గెసు ఆసుపత్రిని ప్రతిపాదించింది ఇటాలియన్ ప్రభుత్వమే. వారు దీనిని త్వరగా అంగీకరించారు.

జనవరి 2024లో మొదటి సారి పిల్లలకు చికిత్స చేయడం ఆరంభించినట్లు ఆసుపత్రి అధ్యక్షుడు వివరించారు.

మతం, సంపదతో సంబంధం లేకుండా మేము అందరినీ స్వాగతిస్తాము అని ఆసుపత్రి అధ్యక్షుడు TIZIANO ONESTI అన్నారు  

మేము పిల్లలకు ప్రత్యేక పద్ధతిలో ఆరోగ్య సంరక్షణను అందిస్తాము, ఈ ఆసుపత్రి తలుపు ఎల్లప్పుడూ అందరికీ తెరిచి ఉంటాయి.

బాంబినో గెసు చాలా ముఖ్యమైన అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఈ కోణంలో శ్రీసభ లక్ష్యాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తుంది.

పిల్లల ప్రయాణం సులభం కాదని అందరికి తెలుసు, తల్లిదండ్రులు తమ పక్కనే ఉండే  అవకాశం ఈ  ఆసుపత్రి  కల్పిస్తుంది అని ఆయన అన్నారు