శాంతి కొరకు ప్రార్థన మరియు ఉపవాస దినానికి పిలుపునిచ్చిన పోప్ లియో

పాల్ VI హాలులో తన సామాన్య ప్రేక్షకుల సమావేశం కొరకు గుమిగూడిన విశ్వాసులను ఉద్దేశించి, పోప్ లియో తన ఆలోచనలను మరోసారి ప్రపంచంలోని అనేక సంఘర్షణ ప్రాంతాల వైపు మళ్లించారు.

ఆగస్టు 22 శుక్రవారం పరిశుద్ధ మరియరాణి పండుగ రోజున శాంతి కోసం ప్రార్థనలో మరియు ఉపవాసం దినముగా జరుపుకోవాలని పోప్ విశ్వాసులను కోరారు.

"మరియతల్లి ఇక్కడ భూమిపై విశ్వాసుల తల్లిగా మరియు శాంతి రాణిగా జ్ఞాపకం చేయబడుతుంది" అని పోప్ అన్నారు.

ఉక్రెయిన్‌లోను మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో యుద్ధాల వల్ల గాయపడుతూనే ఉంది, యుద్ధం కారణంగా బాధపడే వారందరికీ "ప్రార్థన మరియు ఉపవాస దినం"లో పాల్గొనమని పోప్ విశ్వాసులను ఆహ్వానించారు,

 "మనకు శాంతి మరియు న్యాయం జరగాలని మరియు కొనసాగుతున్న సాయుధ పోరాటాల కారణంగా బాధపడేవారి కన్నీళ్లను తుడిచివేయమని ప్రభువును వేడుకుందాం

"ప్రజలు శాంతి మార్గాన్ని కనుగొనేలా పరిశుద్ధ మరియరాణి మధ్యవర్తిత్వం వహించుగాక" అని పోప్అన్నారు.