విమాన ప్రమాదంలో మరణించిన వారి కొరకు ప్రార్దించిన పోప్ ఫ్రాన్సిస్
జనవరి 30 న వాషింగ్టన్ లోని పోటోమాక్ నదిపై జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు మరియు కుటుంబాలకు పోప్ ఫ్రాన్సిస్ సానుభూతిని వ్యక్తం చేశారు.
రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం మరియు సైనిక హెలికాప్టర్ గాల్లోనే ఢీకొన్న తర్వాత జరిగిన ఈ సంఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు భావిస్తున్నారు.
విమానంలో అరవై నాలుగు మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు ఉండగా, సుమారు 30 కి పైగా మృతదేహాలను వెలికితీశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి పంపిన టెలిగ్రామ్‌లో, "మరణించిన వారి ఆత్మలకు సర్వశక్తిమంతుడైన దేవుని దయ మరియు దుఃఖిస్తున్న కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పొప్ ఫ్రాన్సిస్ తెలిపారు
"పునరుజ్జీవన ప్రయత్నాలలో పాల్గొన్న వారి కోసం మరియు దేశంలోని అందరికీ ఓదార్పును దైవిక ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను" అని కూడా ఆయన ధృవీకరించారు.