విద్యా హక్కు కొరకు ప్రార్ధించమని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్

"విద్యా హక్కు" కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తూ, పోప్ ఫ్రాన్సిస్ 2025 జనవరి మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు

."విద్య" ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని, అందరూ చదువుకొని ప్రయోజకులు కావాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన విశ్వ శ్రీసభను కోరారు.

యుద్ధాలు, వలసలు మరియు పేదరికం కారణంగా, దాదాపు 250 మిలియన్ల మంది బాల బాలికలు విద్యకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతీ చిన్నారికి విద్యను అభ్యసించే హక్కు ఉందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

విద్య అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వాలు మరియు సమాజం కృషి చేయాలని ఆయన హితవు పలికారు.

Tags