వాటికన్ లో 1,300 మంది పేదలతో విందు భుజించిన పొప్ ఫ్రాన్సిస్

17వ తేదీన పరిశుద్ధ ఫ్రాన్సిస్సె పోపు గారు వాటికన్‌లోని పాల్ VI ఆడియన్స్ హాల్‌లో 1,300 మంది పేదలతో మధ్యహాన భోజనం భుజించారు

"పేదల ప్రార్థన దేవునికి ఆరోహణ" అనే నేపథ్యంపై ఈ సంవత్సరం ప్రపంచ పేదల దినోత్సవం జరిగింది 

ఈ ఏర్పాట్లు సాధ్యమయ్యేలా సహాయం చేసిన వారందరికీ మరియు అవసరమైన వారితో సంఘీభావాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక మేత్రాసనాలు మరియు విచారణలకు ధన్యవాదాలు తెలిపారు.

పోప్ ఫ్రాన్సిస్ స్వాగతించిన 1,300 మంది అతిథులకు ప్రత్యేక భోజనాన్ని ఇటాలియన్ రెడ్‌క్రాస్ అందించింది, దాదాపు 340 మంది వాలంటీర్లు భోజనాన్ని అందచేశారు .

ఈ విందును ఏర్పాటు చేసిన పాపల్ అల్మోనర్ మరియు డికాస్టరీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ఛారిటీ ప్రిఫెక్ట్ కార్డినల్ కొన్రాడ్ గారు " ఈ వార్షిక సంజ్ఞను పునరావృతం చేయడంలో ఫ్రాన్సిస్  పాపు గారు ఎందుకు అలసిపోరు అంటే  అది  కేవలం యేసు ఉదాహరణను అనుసరించడానికి, " అని వాటికన్ మీడియాతో తెలిపారు 

నిరాశ్రయులైన వారి అవసరాలకు ప్రతిస్పందనగా సహాయం చేయడానికి ప్రతిరోజూ వస్తువులను మరియు ఆహార పొట్లాలను పంపిణీ చేసే అసోసియేషన్ అధ్యక్షుడు రోసారియో వాలస్ట్రో గారు మనకు తోచిన సహాయం చిన్నదైనా వాటిని ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం గొప్పది అని అన్నారు 
  
ఈ విందును జాతీయ రెడ్‌క్రాస్ ఫ్యాన్‌ఫేర్ వారు ఏర్పాటు చేయగా, ముగింపులో, ప్రతి వ్యక్తికి ఆహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను కలిగి ఉన్న బ్యాక్‌ప్యాక్ ను విన్సెంటియన్ గురువులు ఉచితంగా ఇవ్వడం జరిగింది