రోమన్ క్యూరియాకు ప్రత్యేక తపస్సుకాల ధ్యానవడకం

రోమన్ క్యూరియా వారికి ఈ తపస్సుకాలంలో ధ్యాన వడకం మార్చి 9, ఆదివారం, రోమ్ సమయం సాయంత్రం 5:00 గంటలకు ఆరవ పాల్ హాల్‌లో ప్రారంభమై మార్చి 14 వరకు కొనసాగుతాయి.

పోంటిఫికల్ హౌస్‌హోల్డ్ బోధకుడు గురుశ్రీ రాబర్టో పసోలిని “నిత్యజీవముకై నిరీక్షణ” అనే అంశంపై ఈ వడకాన్ని జరపనున్నారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ మార్చి 4 న తెలిపింది.

పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన ప్రతి సంవత్సరం తపస్సు కాలంలో వాటికన్ ఉద్యోగస్తుల కొరకు ప్రత్యేక ధ్యానవడకం జరుగుతుంది.పోప్ పాప సంకీర్తనలు వింటూ, ప్రత్యేక సందేశాలను అందించేవారు.

ఈ సంవత్సరం పోప్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నందువలన పోప్ సహాయకుడు గురుశ్రీ రాబర్టో పసోలినీ ఈ ధ్యాన వడకాన్ని జరపనున్నారు.

ఈ వడకంలో వాటికన్, జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలో వివిధ అంతస్తులలో సేవలందిస్తున్న గురువులు, కార్డినల్స్ పెద్ద ఎత్తులో పాల్గొననున్నారు.