రిపబ్లిక్ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడితో సమావేశమైన పోప్

రిపబ్లిక్ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడు శ్రీ టియోడోరో ఒబియాంగ్ తన భార్య మరియు పరివారంతో పోప్ లియో ను జూన్ 30 శనివారం ఉదయం వాటికన్‌లో కలిశారు.
పొప్ ను కలిసిన తరువాత అంతర్జాతీయ సంస్థలతో హోలీ సీ సంబంధాల కార్యదర్శి మహా పూజ్య పాల్ రిచర్డ్ తో సమావేశమైనట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది
సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించబడింది
విద్యా, ఆరోగ్య సంరక్షణ, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధి రంగాలలో కథోలిక శ్రీసభ సహకారంపై ప్రత్యేక ద్రుష్టి సారించారని
మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాలలో సంఘర్షణల ప్రభావాలు మరియు ప్రజా భద్రతకు సవాళ్లను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాల వ్యక్తపరిచారు అని ప్రకటన పేర్కొంది