అగస్టీనియన్ ఆశ్రమాన్ని సందర్శించిన పోప్ లియో
గురువారం, నవంబర్ 20న ఇటలీ పీఠాధిపతులతో సమావేశం మరియు అస్సిసి పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ సమాధిని సందర్శించిన తరువాత పోప్ లియో సమీపంలోని Montefalco పట్టణానికి ప్రయాణించారు.
Santa Chiara లోని అగస్టీనియన్ ఆశ్రమాన్ని సందర్శించి మఠకన్యలతో సంభాషణలో సమయం గడిపి ప్రార్ధించి, సాంప్రదాయ ఉంబ్రియన్ భోజనం చేశారు.
1290 నుండి సెయింట్ అగస్టీన్ నియమాన్ని పాటిస్తున్న ఈ ఆశ్రమంలో పదమూడు మంది మఠకన్యల ఉన్నారు, వీరు మోంటెఫాల్కోలోని సెయింట్ క్లేర్ జ్ఞాపకార్థం రక్షణ కల్పిస్తున్నారు.
పోప్ ప్రసంగాలు మరియు అగస్టీన్ రచనల నుండి ముఖ్య విషయాలను వివరించే 2026 క్యాలెండర్‌ను, అలాగే చేతితో తయారు చేసిన ఉత్పత్తులతో సహా స్థానిక బహుమతులను అందజేశారు.