బొలీవియా ఉపాధ్యక్షునితో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్

శుక్రవారం, 29 నవంబర్ న, అపోస్టోలిక్ ప్యాలెస్‌ నందు ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా ఉపాధ్యక్షుడు డేవిడ్ డేవిడ్  చోక్హువాంకాతో పొప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు

హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, డేవిడ్ చోక్హువాంకా గారు, వాటికన్ రాష్ట్ర కార్యదర్శి, కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి మహా పూజ్య పాల్ రిచర్డ్ గార్లను కూడా కలిసారు

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో హోలీ సీ, బొలీవియా, స్థానిక చర్చి ల మధ్య ఉన్న 
 సంబంధాలు చర్చనీయ అంశం అయ్యింది . 

దేశంలోని రాజకీయ మరియు సామాజిక-ఆర్థిక పరిస్థితులపై వివిధ అంశాలను కూడా  ఈ సంభాషణలో భాగం అయ్యాయి " అని ప్రకటన పేర్కొంది.