బాలల హక్కులపై మొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం
ఫిబ్రవరి 3, 2025 బాలల హక్కులపై జరిగిన మొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు
వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్లో న్యాయవాదులు మరియు స్వచ్చంద సేవా సంస్థల అధిపతుల సమక్షంలో బాలల హక్కులపై మొట్టమొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది.
ప్రాథమిక మానవ హక్కులు పొందలేని లక్షలాది మంది పిల్లల ప్రపంచ సంక్షోభం గురించి చర్చించడానికి ప్రపంచం నలుమూలల నుండి వక్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు .
ఆధునిక ప్రపంచంలో పిల్లల హక్కులు మరియు విద్యను పొందడం నుండి ఖాళీ సమయాన్ని పొందే హక్కు, ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ హక్కులను గురించి ఏడు ప్యానెల్లు చర్చించాయి
జోర్డాన్ రాణి రానియా అల్ అబ్దుల్లా అంతర్జాతీయ సమాజాన్ని ప్రతి బిడ్డను వారి పరిస్థితితో సంబంధం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఉద్బోధించారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోర్, పర్యావరణ విధ్వంసం ముప్పు గురించి హెచ్చరించారు పర్యావారణాన్ని పరిరక్షించకపోతె అది మన పిల్లలపై ఒక భారంగా మిగిలిపోతుంది.
పోప్ ఫ్రాన్సిస్,ఇతర వక్తలతో కలిసి - పిల్లల హక్కుల రక్షణ మరియు సంరక్షణకు సంబంధించిన 8 సూత్రాల ప్రకటనపై సంతకం చేసి ముగించారు