ఫ్రెంచ్ మిషనరీలు సువార్తను ప్రకటించాలన్న పోప్ ఫ్రాన్సిస్
జనవరి 10, 2025న శుక్రవారం వాటికన్‌లోని కన్సిస్టరీ హాల్‌లో, కాంగ్రేస్ మిషన్,ఫ్రెంచ్ మిషనరీ ఫోరమ్ నుండి యాభై మంది కోఆర్డినేటర్ల ప్రతినిధి బృందంతో పోప్ ఫ్రాన్సిస్ సమావేశమయ్యారు.
విరిగిన ప్రపంచంలో ఆశను పునరుద్ధరించడానికి ధైర్యం మరియు సృజనాత్మకతతో సువార్త ఆనందాన్ని పంచుకోవాలని పొప్ ఫ్రాన్సిస్ సమన్వయకర్తలను ప్రోత్సహించారు.
నవంబర్‌లో బెర్సీలో జరిగే వార్షిక కార్యక్రమానికి కాంగ్రేస్ మిషన్ సిద్ధమవుతున్న తరుణంలో
లౌకిక సమాజంలో సువార్త ప్రచారాన్ని పునరుజ్జీవింపజేయడంపై దృష్టి సారించామని కోరారు.
బెర్సీలో జరగనున్న కాంగ్రెస్ మిషన్ వార్షిక సమావేశం పవిత్ర జూబ్లీ సందర్భంగా జరుగుతుందని తెలుపుతూ నిరీక్షణ మరియు ప్రేషితకార్యం నుండి వచ్చే ఆనందం వివరించలేనిదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
"నిజమైన ఆనందం", "క్రీస్తుతో వ్యక్తిగత సమావేశం నుండి ఉద్భవించి మనల్ని ఇతరుల వైపు నడిపిస్తుంది" అని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం ఫ్రాన్స్‌లోని శ్రీసభకు ఆనందం మరియు పునరుద్ధరణను తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ పొప్ ఫ్రాన్సిస్ ముగించారు