ప్రభువును మన జీవితాల్లోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చిన పోప్

ఆదివారము, 20 జూలై 2025 న కాస్టెల్ గండోల్ఫో లోని లిబర్టీ స్క్వేర్ లో పోప్ లియో త్రికాల ప్రార్థన చేశారు
ఆదివారం దైవార్చన ప్రకారం అబ్రహాము మరియు ఆయన భార్య సారాలు చూపిన ఆతిథ్యాన్ని, ఆ తర్వాత యేసు స్నేహితులైన మార్తమ్మ, మరియమ్మ చూపిన ఆతిథ్యాన్ని ధ్యానించమని పోప్ లియో అందరిని ఆహ్వానించారు
ఆతిథ్యం ఇవ్వడానికే కాదు, దాన్ని స్వీకరించడానికి కూడా వినయం అవసరం. ఆతిథ్యానికి మర్యాద, శ్రద్ధ, మరియు నిస్వార్థ గుణం కూడా అవసరం.
ప్రియ సహోదరీ సహోదరులారా, మన జీవితాలు వర్ధిల్లాలంటే, మనకంటే గొప్పదైన దానికి, మనకు ఆనందాన్ని మరియు సంతృప్తిని కలిగించే దానికి మనం మనల్ని మనం తెరిచి ఉంచడం నేర్చుకోవాలి.
మనం ఎలా నెమ్మదించాలో, మార్తమ్మ కంటే మరియమ్మ వలె మారడం ఎలాగో నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా అవసరమైన, ఉత్తమమైన వాటిని ఎంచుకోవడంలో విఫలమవుతాము.
అబ్రహాము మరియు సారా, వారి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, ముగ్గురు సందర్శకులలో ప్రభువును ఆహ్వానించిన తర్వాత వారు సంతానాన్ని పొందుకొన్నారు. మనం కూడా మన ముందు ఉన్న జీవితాన్ని స్వాగతించడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
శ్రీసభ అందరికీ తెరిచిన గృహముగా ఉండాలి. మన తలుపు తట్టి, లోపలికి రావడానికి అనుమతి అడిగే ప్రభువును ఆహ్వానించాలి అని పోప్ అన్నారు