పేదలకు విందు ఏర్పాటు చేసి వారితో భుజించనున్న పొప్ ఫ్రాన్సిస్

నవంబర్ మూడవ ఆదివారం , అనగా 17వ తేదీన పరిశుద్ధ ఫ్రాన్సిస్సె పోపు గారు సెయింట్ పీటర్స్ బసిలికాలో దివ్యబలి పూజ అనంతరం 1,300 మందికి పైగా  పేదలతో మధ్యహాన భోజనం భుజించనున్నారు 

ప్రపంచ పేదల దినోత్సవాన్ని పురష్కరించుకుని 2017 వ సంవత్సరం నుండి రోమ్‌లోని కొంతమంది పేద ప్రజలతో కలిసి భోజనం చేయడం సంప్రదాయంగా మారింది, దీనితో ఇది ఎనిమిదవ సంవత్సరం.

అదే రోజున విసెంటీయన్లు ఇంటి తాళాలను ఆశీర్వదించనున్నారు. ఈ ప్రాజెక్ట్ లోని నూతన గృహాలు పదమూడు వేర్వేరు దేశాలలో వెనుకబడిన ప్రజల కొరకు నిర్మించినట్లు తెలియచేసారు.

దాదాపు రెండు దశాబ్దాల నుండి వినాశకరమైన ప్రభావాలను అనుభవిస్తూనే ఉన్న సిరియా ఒకటి.

ఈ సంవత్సరం ప్రపంచ పేదల దినోత్సవం కొరకు సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధం  21:5
తీసుకున్న " పేదవాడు మొరను దేవుని చెవిన పడును" అనే నేపథ్యం ఎంచుకున్నారు 

దేవుని హృదయంలో పేదలకు ప్రత్యేక స్థానం ఉంటుందని పోపు గారు అన్నారు .