పవిత్ర స్థలాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన జోర్డాన్ రాజు
పవిత్ర స్థలాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన జోర్డాన్ రాజు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య జెరూసలేంలోని క్రైస్తవ మరియు ఇస్లామిక్ పవిత్ర స్థలాలు రక్షించబడతాయని జోర్డాన్ రాజు అబ్దుల్లా II గారు పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు కు
హామీ ఇచ్చారు.
మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు మే 2న వాటికన్లో ఇజ్రాయెల్‌తో అతి పొడవైన సరిహద్దును కలిగి ఉన్న మధ్యప్రాచ్య దేశమైన జోర్డాన్ రాజుతో 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లా గారు జోర్డాన్ పాపు గారితో మాట్లాడుతూ, జోర్డాన్ "జెరూసలేంలోని పవిత్ర స్థలాలను, హాషెమైట్ కస్టోడియన్షిప్ కింద రక్షించడంలో ముందుంటుందని అని అన్నారు.
1924లో స్థాపించబడిన ఈ సంరక్షకత్వం జెరూసలేంలోని ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ పవిత్ర స్థలాలను రక్షించడంలో జోర్డాన్‌లోని హాషెమైట్ రాజకుటుంబం ముందుంటుంది.
జెరూసలేం మరియు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై స్థిరనివాసుల దాడులను ఆపాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భముగా జోర్డాన్ రాజు నొక్కిచెప్పారు.జోర్డాన్‌లోని క్రైస్తవ పవిత్ర స్థలాలను, ముఖ్యంగా యేసు బాప్టిజం పొందిన స్థలం, "జోర్డాన్ బియాండ్ బెథానీ" పరిరక్షించడానికి జోర్డాన్ యొక్క నిబద్ధతను రాజు అబ్దుల్లా నొక్కిచెప్పారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer