పవిత్ర ద్వారాలు తెరిచి 2025 జూబ్లీని ప్రారంభించిన పోప్ ఫ్రాన్సిస్

24 డిసెంబర్ 2024 సాయంత్రం సెయింట్ పీటర్స్ బసిలికా పవిత్ర ద్వారాలను తెరిచి 2025 జూబ్లీ నిరీక్షణా సంవత్సరాన్ని పొప్ ఫ్రాన్సిస్ ప్రారంభించారు.

ఈ పవిత్ర ద్వారం తెరవడం, క్రీస్తు జయంతి మధ్యరాత్రి దివ్యబలిపూజ తో పొప్ ఫ్రాన్సిస్ ప్రతీ  25 సంవత్సరాలకు ఒకసారి జరిగే చారిత్రాత్మక జూబ్లీని ప్రారంభించారు.

6 జనవరి 2026న అదే పవిత్ర ద్వారం క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున మూసివేయడంతో సాధారణ జూబ్లీ ముగుస్తుంది.

డిసెంబరు 26న, జూబ్లీ సంప్రదాయంలో మొదటిసారిగా, పోప్ ఫ్రాన్సిస్ రోమన్ జైలులో ఐదవ పవిత్ర పోర్టల్‌ను తెరుస్తారు, ఇది ఖైదీలతో ఆయనకు కొనసాగుతున్న సాన్నిహిత్యాన్ని చూపుతుంది.

ఆదివారం, 29 డిసెంబర్ న కేథడ్రల్ సెయింట్ జాన్ లాటరన్ పవిత్ర తలుపును తెరుస్తారు, ఈ సంవత్సరం నవంబర్ 9న 1700వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

తరువాత, 1 జనవరి 2025న, మేరీ పవిత్రత, దేవుని తల్లి, సెయింట్ మేరీ మేజర్ పాపల్ బసిలికా  పవిత్ర తలుపు తెరవబడుతుంది.

చివరగా, ఆదివారం, 5 జనవరి 2025, గోడల వెలుపల సెయింట్ పాల్ పాపల్ బాసిలికా పవిత్ర ద్వారం తెరవబడుతుంది.