పర్యావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: ఫ్రాన్సీస్ జగద్గురువులు
పర్యావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: ఫ్రాన్సీస్ జగద్గురువులు
మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు పర్యావరణ మార్పులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ నాయకులను కోరారు. వాతావరణ స్థితిస్థాపకతపై మూడు రోజుల వాటికన్ శిఖరాగ్ర సమావేశంలో మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు పాల్గొన్నారు.
తీవ్ర వడగాడ్పులు, ముంచెత్తే వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక సర్వసాధారణం అయిపోతున్న ఈరోజులలో భూ తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాల తీవ్రత తగ్గించడమే మనకున్న ఏకైక మార్గం అని మహా పుజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు.
వాతావరణ చర్యకు "సమగ్ర" విధానాన్ని అభివృద్ధి చేయడంలో అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేయాలని ముగ్గురు U.S. గవర్నర్లను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువులు కోరారు.
మే 16న వాటికన్లో సమావేశమైన పండితులు మరియు ప్రభుత్వ నాయకులతో ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలుకు మానవ తప్పిదాలే కారణం అని, ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను రక్షించే బాధ్యత మనపై ఉందని, వారిని రక్షించడానికి నిరాకరించడం తీవ్రమైన నేరం" అని ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు.
ఈ సమావేశం లో కాలిఫోర్నియా, న్యూయార్క్ మరియు మసాచుసెట్స్ గవర్నర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది గవర్నర్లు మరియు అంతర్జాతీయ నగరాల నుండి 16 మంది మేయర్లు పాల్గొన్నారు.
ఫ్రాన్సీస్ జగద్గురువులుతో సమావేశానంతరం క్యాథలిక్ న్యూస్ సర్వీస్‌తో మాట్లాడిన కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, వాతావరణ మార్పులపై నైతిక గాత్రాలు అవసరమని అన్నారు.
శిఖరాగ్ర సమావేశం రెండవ రోజున పండితులు ప్రభుత్వ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్‌దే ప్రధాన పాత్ర అని ,వాతావరణం నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు చెట్లు నాటడంతో సహ పలు చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో "స్థానికవాదం నిర్ణయాత్మకమైనది" అని న్యూసోమ్ చెప్పారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer