పంచగాయాలను తద్దిభా అను యువతి పొందుకున్నారు.

కడప మేత్రాసనం లోని రామాపురంలోని పునీత పాద్రేపియో దేవాలయంలో పంచగాయాలను తద్దిభా అను యువతి పొందుకున్నారు.

MMG మఠ సంస్థలో మఠకన్యగా మారటానికి శిక్షణ తర్ఫీదు తీసుకోవడానికి ఒరిస్సా నుండి తద్దిభా అనే యువతి వచ్చింది. మఠకన్యలుగా శిక్షణ తీసుకుంటున్న మిగతా వారితోకలసి ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈమె ఒక మరియతల్లి స్వరూపం ను చూపించి అందరిని అక్కడ ప్రార్థన చేయాలనీ కోరారు. ఆ మరియమాత స్వరూపంకూడా కన్నీరు కార్చుట అందరూ చూసారు. ఆమె కూడా పంచగాయాలను పొందుకున్నారు. ఈ అద్భుత సంఘటనను చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. శ్రీసభలో పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ గారు, మరియు మన కాలానికి చెందిన దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారు పంచగాయాలను పొందుకున్నారు .ఆయితే ఈ పంచగాయాల అద్భుతం శ్రీసభ ఇంకా అధికారకంగా ప్రకటించలేదు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer