నైట్‌క్లబ్ అగ్నిప్రమాద బాధితులకు సంతాపాన్ని వ్యకతం చేసిన పోప్ ఫ్రాన్సిస్

నైట్‌క్లబ్ అగ్నిప్రమాద బాధితులకు సంతాపాన్ని వ్యకతం చేసిన పోప్ ఫ్రాన్సిస్ 

ఉత్తర మాసిడోనియాలోని (Kocani) కోకానిలోని ఒక నైట్‌క్లబ్‌లో రాత్రిపూట సంభవించిన విషాద అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పోప్ ఫ్రాన్సిస్ తన "ప్రగాఢ సంతాపాన్ని" వ్యక్తం చేశారు

ఈ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించగా, 155 మంది గాయపడ్డారు.

స్కోప్జే ( Skopje )పీఠాధిపతి మహా పూజ్య కిరో ను ఉద్దేశించి సెక్రటరీ ఆఫ్ స్టేట్  కార్డినల్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్‌లో పోప్ ఉదేశం తెలియపరిచారు.

"ప్రాణాలను కోల్పోయిన వారి కోసం ప్రార్థనల హామీ ఇస్తూ , ఇటువంటి కష్ట పరిణామాల వల్ల బాధపడుతున్న వారికి ఓదార్పు చేకూరాలని ప్రభువును వేడుకున్నారు.

Kocaniలోని ఒక నైట్‌క్లబ్‌లో 1,500 మంది హాజరైన సంగీత కచేరీ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 

వేదికపై బాణసంచా కాల్చడం వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చు, బాధితుల్లో ఎక్కువ మంది 14 మరియు 27 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వున్నారు అని ప్రకటన పేర్కొనింది 

"ఈ రోజు మాసిడోనియాకు విచారకరమైన రోజు, చాలా మంది యువకుల ప్రాణాలను కోల్పోవడం కోలుకోలేని పరిణామం మరియు కుటుంబాలు, బంధువులు ,స్నేహితుల బాధను కొలవలేనిది."అని ప్రధాన మంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ (Hristijan Mickoski ) రాశారు

సెర్బియన్  ప్రభుత్వం బాధితుల జ్ఞాపకార్థం మార్చి 18ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.