నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు జులై 13,2024 న బెంగుళూరు అగ్రపీఠానికి సేక్రేడ్ హార్ట్ విచారణ గురువు గురుశ్రీ జోసఫ్ సూసైనాథన్ (60) గారిని సహాయక పీఠాధిపతిగా నియమించారు.

గురుశ్రీ జోసఫ్ సూసైనాథన్ 14 మే 1964న బెంగళూరులో జన్మించారు.

ఈయన సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు తిరుచిరాపల్లి మేత్రాసనంలో సెయింట్ పాల్స్ సెమినరీలో వేదాంతశాస్త్రం అభ్యసించారు

1990 మే 15న బెంగుళూరు అగ్రపీఠానికి గురువుగా అభిషేకింపబడ్డారు.

1990-1991 సెయింట్ జోసఫ్ మరియు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కేథడ్రల్ సహాయక విచారణ కర్తగా 
1991-1997 సెయింట్ ఆన్, 1997-2004 సెయింట్ జాన్ ఎవాంజెలిస్ట్ , 2004-2010 మరియు 2017-2020 సంవత్సరాలలో అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా, 2010-2017 సెయింట్ పీటర్ మరియు పాల్ మరియు 2020 నుండి ఇప్పటివరకు సేక్రేడ్ హార్ట్ విచారణ గురువుగా సేవను అందించారు 

బెంగుళూరు అగ్రపీఠంలో లాటిన్ కథలిక్ జనాభా 3,60,561, 134 విచారణలు మరియు 157 మేత్రాసన గురువులు ఉన్నారు.

ఇది బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, చిక్‌బల్లాపూర్, కోలార్, రాంనగర మరియు తుమకూరు సివిల్ జిల్లాలతో కూడిన 27,014 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

ఈ అగ్రపీఠ భూభాగం గతంలో మైసూర్ మిషన్‌లో భాగంగా ఉండేది, 1845లో పాండిచ్చేరి నుండి వేరు చేయబడింది.

మైసూర్ మిషన్ 1850లో అపోస్టోలిక్ వికారియేట్‌గా మరియు 1886లో బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ఎదిగింది.

బెంగళూరు మేత్రాసనం ఫిబ్రవరి 13, 1940 న మైసూర్ నుండి విభజించబడింది మరియు ఇది 1953లో అగ్రపీఠంగా మారింది.

మహా పూజ్య పీటర్ మచాడో (70) బెంగుళూరు మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతిగా , మరియు మహా పూజ్య బెర్నార్డ్ బ్లాసియస్ మోరాస్ (82)  విశ్రాంత అగ్రపీఠాధిపతులు.