దివ్యాంగులకు క్రీస్తు జయంతి వేడుకలను నిర్వహించిన మైసూర్ పీఠం

డిసెంబర్ 15, 2024న మైసూర్‌లోని, బన్నిమంటప్‌లోని క్యాథలిక్ సెంటర్ హాల్‌లో క్రీస్తు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

మైసూర్ మేత్రాసన దివ్యాంగుల మరియు భారత చెరసాల పరిచర్య విభాగం వారు ఈ వేడుకను నిర్వహించారు. 

మైసూర్ మేత్రాసన అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా పూజ్య  బెర్నార్డ్ బ్లాసియస్ మోరాస్ అధ్యక్షతన దివ్యబలి పూజ సమర్పించడంతో ఈ వేడుక ప్రారంభమైయింది.

100 మందికి పైగా దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు చెరసాల పరిచర్య విభాగం సభ్యులు పాల్గొన్నారు.

మాంట్ ఫోర్ట్ స్కూల్,మెర్సీ కాన్వెంట్, స్నేహ కిరణ్ స్పస్తి సొసైటీ మరియు స్పందనా స్పెషల్ స్కూల్ వారు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు


సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ ఫ్యాకల్టీ మరియు మెస్సర్స్ లూనార్స్ కంపెనీ వారు స్పాన్సర్ చేసిన బహుమతులు పీఠాధిపతులవారు అందరికి అందించారు 

ముఖ్య అతిథిగా, కర్నాటకలోని డిఫరెంట్లీ ఏబుల్డ్ కమిషన్ సెక్రటరీ శ్రీమతి ఎస్తెల్లే డిసౌజా, సామాజిక సవాళ్ల మధ్య వైకల్యాలు ఉన్న బిడ్డను పెంచడం ఎంత కష్టమో తెలియపరిచారు 

ఈ కార్యక్రమంలో మేత్రాసన మోన్సిగ్నర్ గురుశ్రీ ఆల్ఫ్రెడ్, గురుశ్రీ జోసెఫ్ గురుశ్రీ సెబాస్టియన్ మరియు గురుశ్రీ థామస్ తదితరులు పాల్గొన్నారు .