దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిల్లు, వంట సరుకులు పంపిణీ చేసిన JSSS

హైదరాబాద్ జీవోదయ సోషల్ సర్వీస్ సొసైటీ JSSS  వారి ఆధ్వర్యంలో జూన్ 25 న  కర్నూలు మేత్రాసనం ఆదోని మండలం పెద్ద కడుమూర్ కు చెందిన దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిల్లు, వంట సరుకులు పంపిణీ చేయడం జరిగింది .

ఈ సందర్భంగా జీవోదయ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ గురుశ్రీ సురేష్ SVD మాట్లాడుతూ 
"తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నిరుపేదల కోసము,దివ్యాంగుల కోసము JSSS పనిచేస్తుందని దానిలో భాగంగానే ఆదోని డీన్ గురుశ్రీ కోలా విజయరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేయడం జరిగిందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దివ్యాంగులకు తమ వంతు సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

అలానే మండల విద్యాధికారులు శ్రీ రాజేంద్రప్రసాద్, శ్రీ శ్రీనివాసులు, సువర్ణ సునిలియం తదితరులు మాట్లాడుతూ ఎంత డబ్బు ఉన్నా ఇతరులకు సాయం చేయకపోతే వ్యర్ధమని డబ్బు లేకున్నా కూడా వనరులను సమకూర్చుకొని సహాయం చేయడానికి ముందుకు రావాలని, "మానవ సేవయే మాధవసేవ" అని తలంపుతో ఇతరులకు సాయం చేస్తే అది గొప్ప ఆశీర్వాదం అని వారు అన్నారు

గురుశ్రీ  కోలా విజయరాజు గారు మాట్లాడుతూ దివ్యాంగులను ఎవరు కూడా చిన్నచూపు చూడకూడదని వారికి కూడా దేవుడు జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనే శక్తిని కలిగించాడని ఇతరులను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించాలని అటువంటివారిని ఎటువంటి పరిస్థితుల్లో కించపరచకూడదని తమతో సమానంగా  చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని " నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే క్రీస్తు ప్రభు ఆజ్ఞను పాటిస్తూ అటువంటి అలవాటును మనం కూడా అలవర్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

పది మంది దివ్యాంగులకు ట్రై సైకిల్లు, వంద మందికి వంట సరుకులు, ఉచిత భోజన సౌకర్యాన్ని జీవోదయ సోషల సర్వీస్ సొసైటీ ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ శాంతరాజు, శ్రీ సుబ్బరాయుడు, మౌనిక సామాజిక కార్యకర్తలు శ్రీ చార్లెస్ ,శ్రీ నవీను తదితరులు పాల్గొన్నారు.